20, ఆగస్టు 2019, మంగళవారం

నవసాక్షులు

ఓం శ్రీ మహాగణాధిపతయే నమః

శ్రీ మహా సరస్వత్యై నమః శ్రీగురుదత్తాత్రేయాయ నమః

భగవత్ బంధువులారా!!!!!

భగవంతుడు మనకు ప్రసాదించిన సమయం 24 గంటలు ఈ సమయాన్ని దైనందిన కార్యక్రమాలు వృత్తి వ్యాపార వ్యవసాయ ఉద్యోగాదుల యందు భోజన విశ్రాంతి సుఖ సంతోషాల యందును వినియోగిస్తూ ఉంటాం ఇందులో శుభ అశుభ కార్యములు కలిసి ఉంటాయి వీటిని ఎవరు గమనించరు అనుకుంటే పొరపాటే వీటిని 9దైవీ శక్తులు ఎప్పుడు గమనిస్తూ ఉంటాయి.అవి ఏమిటి? ఇప్పుడు తెలుసుకుందాము.

శ్లో|| సూర్యస్సోమో యమఃకాలోమహాభుతానిపంచచ|

ఏతే శుభాశుభ స్యేహా కర్మణో నవ సాక్షిణః||

అనగా సూర్యుడు చంద్రుడు యముడు కాలపురుషుడు భూమి నీరు అగ్ని గాలి ఆకాశం ఈ 9 దైవ శక్తులు ఎప్పుడు మనల్ని గమనిస్తూనే ఉంటాయి.

1.సూర్యుడు:-

పిపీలకాది బ్రహ్మాండ పర్యంతం ప్రతీ జీవికి రోజు ప్రారంభం అవ్వాలంటే సూర్యుడు ఉదయిం చాలి ఆయన తూర్పున ఉదయించి పశ్చి మమున అస్తమించే వరకు 84లక్షల జీవ రాశుల యొక్క కర్మలకు కర్మ సాక్షిగా ప్రత్యక్ష దైవంగా ఉన్న మొట్ట మొదటి సాక్షి సూర్యభగవానుడు.

2.చంద్రుడు:-

శ్రమించిన దేహం సేద తీరాలన్న ప్రేమికుల మనస్సుకు ఆహ్లాదం కలగాలన్న నవ దంపతులకు మనోరంజకంగా ఉండాలన్నా వయో వృద్దులు మనశ్శాంతిని పొందాలన్న పసి పాపలు గోరుముద్దలు తినాలన్న చంద్రోదయం జరగాల్సిందే .సూర్యుడు ఉదయం లగాయతు అస్తమయం వరకు బాధ్యత వహిస్తే , అస్తమయం నుంచి ఉదయం వరకు బాధ్యత వహించిన 2వ కర్మ సాక్షి చంద్రుడు.

3.యముడు:-

సర్వకాల సర్వావస్థల యందు జీవుడు చేస్తున్న సమస్త ధర్మా ధర్మ కర్మలను నిరంతరం లెక్కిస్తూ దానిని బట్టి

శిక్షా వరప్రదానము లను ప్రసాదిస్తూ సమవర్తిగా న్యాయ పరిపాలనా చక్రవర్తిగా ధర్మ దేవత అయిన

3వ కర్మ సాక్షి యమ ధర్మరాజు.


4. కాల పురుషుడు:-

కాలము భగవత్ స్వరూపము 24 గంటలు 360 రోజుల సమయాన్ని మొత్తం క్షణం కూడా వృధా పోనివ్వ కుండా మనుజులు సద్వినియోగం చేసుకోవాలని వారు వృధా చేస్తే గడచిన కాలం తిరిగి రాదు అని తెలియజేస్తూ కాల క్రమంలో వారి కర్మల యొక్క ఫలితమును బాల్య యవ్వన కౌమార వార్ధక్య ములలో అందజేస్తున్న

4వకర్మ సాక్షి కాల పురుషుడు.

5. భూమి.

భుమిర్ధేను ధరణి లోక ధారిణి సమస్త జీవులను ఉద్ధరించే ది భూమి కలౌఅన్నగతి ప్రాణః

కలి యుగం లో జీవులు అన్న గతి ప్రాణులు

అన్నమునకు,సమస్త జీవుల మనుగడకు

ఆధార భూతమైన 5వకర్మ సాక్షి భూమి.

6.నీరు.

నవ రంధ్ర ములతో మలిన మైన దేహమును గృహమును స్థలములను శుభ్రపరచుటకును అన్నార్తులైన జీవులకు అన్నము దొరకనప్పుడు వారి కడుపు నింపి పాపములను పోగొట్టు

6వ కర్మ సాక్షి నీరు.

7.అగ్ని

lజీవుల మనుగడకు అవసరమైన బియ్యమును వండడానికి శీతాకాలంలో వెచ్చదనం కోసం ముఖ్యముగా దేవతలకు మానవులకు మధ్య అనుసంధాన కర్త అయిన 7వ కర్మ సాక్షి అగ్ని.

8.వాయువు.

జాగ్రత్ స్వప్న సుషుప్తి అవస్థలు మరియు సర్వ కాలముల యందు మనతో ప్రమేయం లేకుండా ఒక క్రియ జరిగిపోతూ ఉంటుంది అదే ఉచ్వాస నిశ్వాస స్వరూపమైన జీవ ప్రక్రియ అగ్ని జ్వలించ డానికి దేహం తాపము నుండి ఉప శమనం పొంద డానికి ,జీవ ప్రక్రియ నిరంతరం కొనసాగడానికి బాధ్యత వహిస్తున్న 8వ కర్మ సాక్షి వాయువు.

9.ఆకాశం

ఆకాశంఅంటే అవకాశం మనకు ఎన్నో విధముల గా సహకరిస్తూ అన్నిటి యందు ఆధార భూతమై ఉన్నది బ్రహ్మాండం లో ఎక్కడ ఉన్నా సరే మనల్ని అను నిత్యం గమనిస్తున్న 9వ కర్మ సాక్షి ఆకాశం.

అందువల్ల మనుజుడు ఏ పని చేసినా వీరిని దృష్టిలో ఉంచుకుని చెయ్యాలి లేనిచో వారు మంచి చెడు లు నిర్ణయించి శుభాశుభ ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది.

హరిఃఓం తత్సత్.

సర్వంశ్రీ గురు దత్తాత్రేయార్పణమస్తు.

సర్వే జనాఃసుఖినోభవంతు.

A.PRAKASH.