6, ఫిబ్రవరి 2013, బుధవారం

ఓంశ్రీపరబ్రహ్మణేనమః

శ్రీమహాగణపతయేనమః                                                                                                 శ్రీమహాసరస్వత్యైనమః
                                         శ్రీపాదవల్లభనరసింహసరస్వతిశ్రీగురుదత్తాత్రేయాయనమః


గజాననం భుతగణాధి సేవితం కపిత్థ జమ్బూ ఫలసారభక్షణం
ఉమా సుతం శోకవినాశ కారణం నమామి విఘ్నేశ్వర పాదపంకజం

జై గురు దత్త!!                                                                                                                       శ్రీగురుదత్త!!

మన భారతదేశం పుణ్యభూమి కర్మ భూమి పరబ్రహ్మ యొక్క దశావతరాలతో12 జ్యోతిర్లింగాలతో 18శక్తి పీఠాలతో సనాతన ఋషి సాంప్రదాయంతో వెల్లివిరుస్తోంది . 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన కాశీ మహానగరం అత్యద్భుత మైనది చాల పవిత్రమైనది ఈనగరాన్నే వారాణసీ అని కూడా అంటాం మనం కాశీ వెళ్లలేకపోయిన కాశీ వెళ్ళాలని మూడు సార్లు మనసులో తలిస్తే కాశీ వెళ్ళిన ఫలితం మనకు లభిస్తోంది అనుకుంటేనే వెళ్ళిన ఫలితం లభిస్తే కాశీ వెళ్ళితే ఇంకెంత ఫలితం లభిస్తుంది గంగలో స్నానం చేస్తే ఇంకెంత ఫలితం లభిస్తుంది అందుకే జీవితం లో ఒకసారైన కాశీ మహానగరాన్ని సందర్శించాలి గంగలో స్నానం చేయాలి.ఈ యాత్ర చేయడం వల్ల పాపము నశిస్తుంది ,              గంగా స్నానం గురించి ఒక ఇతిహాసం గలదు 


ఒకా నొక సమయంలో ఒక మహారాజు గారు వారణాశి క్షేత్రమునకు విచ్చేసి నారు వారు అచ్చ ట గంగా స్నానం చేసి విశ్వేశ్వరుని అమ్మవారిని అన్నపూర్ణ మందిరం ను దర్శించిన తర్వాత కొంత బంగారము వజ్ర వైడూర్యములతో చేసిన నగలు ధన రాసులతో నిండిన ఒక పెట్టెను పాపము లేని వ్యక్తి కి దానం చేయాలని పించింది  అయితే పాపం లేని వ్యక్తి ఎవరుంటారు ,పుట్టిన ప్రతీ జీవి తెలిసో తెలియాకో ఎంతో కొంత పాపం చేసిన వారే కానీ చేయని వారు లేరు
                                      రాజు గారి ఆజ్ఞ ప్రకారం భటులు అమూల్యమైన వస్తువులతో నిండిన పెట్టెను గంగా నది వద్దకు తీసుకుని వచ్చి పాపము లేని వ్యక్తి ఎవరైతో ఉంటారో అతనికి
ఈపెట్టెను దానం చేస్తారు,ఎవరైనా ఉంటె రావలసినదిగా మనవి చేస్తున్నాముఅని చెప్పిరి.
                                     ఆ విషయం విన్నభక్తజనులు మేము రాలేము అంటే మేము రాలేము అన్నారు ఈమాటలు విన్న మహారాజు ఇంతమంది భక్త జనులలో పాపమూ లేని వ్యక్తేలేడా  అని ప్రశ్నించగ లేకనే ప్రభు ఉన్నాడు అని ఒక బ్రాహ్మణోత్తముడు ఎదురుగావచ్చి  మీ దానమును నేను గ్రహిస్తానని చెప్పెను.
మహారాజు:- నువ్వు పాపమూ లేని వ్యక్తివని ఋజువు ఏంటి?
బ్రాహ్మణోత్తముడు:- ఉన్నది ప్రభు మీరు దానమిచ్చినచో ఋజువు చేసెదను ఋజువు చేయలేకపోతే మీరు ఏ శిక్షవిధించినను అందుకు సంసిద్ధమే.
మహారాజు సరే అని చెప్పెను బ్రాహ్మణోత్తముడు గంగానది ఒడ్డునకు రమ్మని చెప్పెను
 బ్రాహ్మణోత్తముడు గంగానదిలో స్నానం చేసి మహారాజు గారు ఇచ్చిన దానమును గ్రహించి
మహారాజా !!! గంగానదిలో స్నానంచేస్తే సమస్త పాపములు పోతాయి
ఇది ఋషి  వాక్కు ఆర్య వాక్కు గంగానదిలో స్నానం చేసి వచ్చిన నేను పాపరహితుడను
కాబట్టి మీరు పాపము లేని వ్యక్తికే దానమిచ్చితిరిఅని చెప్పెను
మహారాజు అక్కడున్న భక్తజనం ఆశ్చర్యచికితులై పోయారు
మరు క్షణం లో శ్రీ గంగామాత ప్రత్యక్షమై వేదవిధుడైనఈ బ్రాహ్మణోత్తముడుచెప్పిన మాటలు నిజము. ఇతను పాపరహితుడే . ఇతనే కాదు నన్ను నమ్మి స్నానం చేసిన ప్రతీ వ్యక్తీ పాపరహితుడే అని చెప్పెను.
     అంతట బ్రాహ్మణోత్తముడు మహారాజు భక్తజనులు అమ్మవారి దర్శనం తో పునితులై అమ్మవారిని పూజించి హరతిచ్చితరించినారు.హరి:ఓమ్ తత్సత్.సర్వేజనాస్సుఖినోభవంతు.